రాజేంద్రనగర్ తెలంగాణ కానుక
ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగం ఇచ్చిన వజ్రాయుధం ఓటు హక్కు రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు. మంగళవారం హైదర్ గూడ లోని బూత్ నంబర్లు 238, 239, 240, 241 బూత్ ల పోలింగ్ స్టేషన్ డోనాల్డ్ స్కూల్ శక్తి కేంద్రంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోఎస్. ఐ. ఆర్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్ సహాయ కేంద్రానికి రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్ పర్యవేక్షించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క ఓటరూ తప్పకుండా తమ ఎన్యుమరేషన్ ఫారం ను నింపి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని తెలియజేసినారు. వారికి బిజెపి నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలియజేసినారు. ఓటర్లకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోగలరని తెలియజేసినారు. మరియు ఇప్పటివరకు కూడా ఎమ్యూనరేషన్ ఫార్మ్స్ అందని వారు వారి ఓటర్ ఐడి కార్డు గాని ఆధార్ కార్డు గాని తమతో తీసుకొని వస్తే ఎమ్యూరేషన్ ఫారమ్ ఏ బి. ఎల్. ఓ. దగ్గర ఉందో వాటి వివరాలు కూడా తమ కార్యకర్తలు యాప్ లో పరిశీలించి తెలియజేస్తారని అన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ ఎస్ ఐ ఆర్ ఫామ్ తీసుకొని వీలైనంత తొందరగా, చివరి రోజున మళ్ళీ ఇబ్బందులు పడకుండా, నింపి ఇస్తేనే వారి ఓటు సురక్షితంగా ఉంటుందని లేకపోతే డిలీట్ అయ్యే ప్రమాదం ఉందని తెలియజేసినారు. ఇప్పుడు ఫారమ్స్ తిరిగి ఇచ్చిన వారికి మాత్రమే ఆగస్టు 10వ తేదీ తర్వాత మార్పులు చేర్పులు కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఉందని తెలియజేసినారు. పాల్గొన్నవారు : చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ రంగారెడ్డి జిల్లా ఎస్ఐఆర్ ఇన్చార్జ్ నారా గూడెం మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా బిజెపి సెక్రెటరీ రాజేంద్రనగర్ అసెంబ్లీ ఎస్ఐఆర్ ఇన్చార్జ్ బిఎల్ఏ 1 పొన్నమోని మల్లేష్ యాదవ్, రంగారెడ్డి జిల్లా కార్యాలయ కార్యదర్శి బీ. ఎల్. ఏ. 2 సాబాద విజయ్ కుమార్ బీజేపీ పార్టీ క్రియాశీల సభ్యురాలు సాబాద స్వప్న, సీనియర్ నాయకులు గొరిగే రాజు, డివిజన్ ఉపాధ్యక్షురాలు పొట్ట గాయత్రి అనిల్ కుమార్, కాకులారం కృష్ణ, సాయి యాదవ్, బీ. ఎల్. ఏ. నారగూడెం సోమ్ నాథ్ రెడ్డి, తాటి రాజు, మల్లేష్ చారి, ఎల్. వెంకటేష్, కైల రవీందర్ రెడ్డి, ఎస్. భజరంగ్ రెడ్డి, డి. రాములు,సులిగే శ్రీనివాస్, మోండ్ర అయిలయ్య మరియు నాయకులు కార్యకర్తలు బీ. ఎల్. ఓ. లు నిషిత ప్రభు గౌడ్ మౌనిక శోభన్ పాల్గొన్నారు.
