వైభవంగా శ్రీరామ దేవాలయ మూడవ వార్షికోత్సవ వేడుకలు

Spread the love

ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో కొలువై ఈ కార్య సిద్ధి సీతారామాంజనేయ స్వామి తృతీయ వార్షిక (బ్రహ్మోత్సవాలు) వేడుకలు గత మూడు రోజుల నుండి ఆలయ చైర్మన్ ట్రష్టి బి.నాగరాజ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నా యి. బుధవారం శుభ్రాత సేవ నిత్యారాధన, సేవా కాలం శశాత్తుమోరై శాంతి పాఠం వేద విన్నపాలు, ద్వార తోరణం, ధ్వజ కుంభారాధన, నిత్యా ఆహవనం, నిత్య పూర్ణవతి బలిహరణ, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆలయ నూతన స్వర్ణ కవచ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు.

శ్రీ కార్యసిద్ధి సీతారామాంజనేయ స్వామి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలకు రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి. ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయంలోని గర్భగుడికి నూతనంగా ఏర్పాటు చేసిన వెండి తలుపులను వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సాంప్రదాయ బద్దంగా ప్రారంభించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఎమ్మెల్యే కు తీర్థప్రసాదాలు అందించి, శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
దేవాలయాలు మన సనాతన ధర్మానికి, ప్రశాంతతకు నిలయాలని అన్నారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే, ఆలయ మూడవ వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఆలయ చైర్మన్ ట్రస్ట్రీ నాగరాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజే నాగరాజ పుట్టినరోజు కావడంతో ఆయనకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ…. శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించే శక్తి కలగాలని ఆకాంక్షించారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్, మణికొండ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ కె రామకృష్ణారెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాల్రెడ్డి ఎరుకుల కుమార్ పుల్లారెడ్డి శ్రీహరి భక్తులు అల్కాపూర్ టౌన్‌షిప్ కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *