సదాల వెంకట్ రెడ్డి
రాజేంద్రనగర్ : తెలంగాణ కానుక
బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల కష్టంతో గెలిచిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన పదవి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలని రాజేంద్రనగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ సదాల వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం శివరాంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన పదవికి రాజీనామా చేసి, దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి పేరుతో ఇప్పటికే రెండు పార్టీలు మారిన ఎమ్మెల్యే
ప్రజల కోసం కాకుండా తన సొంత లాభం కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ తాను ఇప్పటికీ బిఆర్ఎస్ లోనే ఉన్నానంటూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే అదే పార్టీలోకి మారడం ప్రకాష్‌గౌడ్‌కు పరిపాటిగా మారిందన్నారు.కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేపై శాసనసభాపతి చర్యలు తీసుకోవాలన్నారు.
ఎమ్మెల్యే
మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని పేర్కొన్నారు.
