కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.

Spread the love

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పథకాలను రూపొందిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని వసంత నగర్ లో శ్రీవాణి అనే మహిళ నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఇవానియా బ్యూటీ పార్లర్ ను ఆయన టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు తమకు తామే అవకాశాలను సృష్టించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు సంకల్పం దీక్ష పట్టుదల ఉంటే తాము అనుకుంటే మహిళలు ఏదైనా సాధించగలరన్నారు. శిక్షణ పొందతాము కూడా స్వయం ఉపాధిని పొంది ఆర్థికంగా నిలబడతారన్నారు. టీజీ ఐఐసీ చైర్మన్ శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుందన్నారు. మరిన్ని బ్యూటీ పార్లర్లను ఏర్పాటు చేయాలని శ్రీ వాణి ఆర్థికంగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆశ భావం వ్యక్తం చేశారు బండి రమేష్ గారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి వాటి ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు గతంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయాలంటే కోటీశ్వరులకు తప్ప సాధ్యం కాదని కానీ ముఖ్యమంత్రి స్వయం సహాయక సంఘాల ద్వారా మధ్యతరగతి మహిళలను సైతం పెట్రోల్ బంకులు పెట్టుకునే స్థాయికి తీసుకు వెళుతున్నారన్నారు ఆర్టీసీకి అద్దకి ఇచ్చే బస్సులు సైతం మహిళలే కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నారన్నారు బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు శ్రీవాణిని వీరు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కూన శ్రీశైలం గౌడ్, సత్యం శ్రీరంగం, గాలి బాలాజీ, శేరి సతీష్ రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కొప్పిశెట్టి, దినేష్, గంధం రాజు, సాయి బాబు చౌదరి, సుజాత ,వాణి ,లల్లి కాంత్, సంధ్య ,రజిత, రంగా మోహన్, రేష్మ ,శివ చౌదరి తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *