రోడ్ సెక్టార్ పాలసీ-2047 కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి
హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించండి
ఇప్పటికే గుర్తించిన ఏరియాలలో రోడ్ల అభివృద్ధి పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోండి
సమస్యలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలతో సమీక్ష నిర్వహించి స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలి
ప్రతీ ప్రధాన జిల్లా కేంద్రానికి ఒక రింగ్ రోడ్ అభివృద్ధి చేసే అంశాన్ని అధ్యయనం చేయండి.
ఆ రింగ్ రోడ్స్ ను హైవేలకు అనుసంధానించే అంశాన్ని పరిశీలించండి.
సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయండి.
టీచింగ్ హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రుల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తిచేయాల్సిందే.
పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా హాస్పిటల్స్ భవనాల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
సీఎం సమీక్షా సమావేశం.
