హిందూ, ముస్లింలు సోదరభావంతో మెలగాలి: కేఎల్ఆర్.

Spread the love

సెక్యులర్ భావాజలమే భారతదేశ ప్రజల బలమని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ జల్ పల్లి డివిజన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జహంగీర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో కే ఎల్ ఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశం, రాష్ట్రంలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు, పార్టీలు కలిసి కుల, మతాలను విడదీసి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.
హిందూ, ముస్లిం భాయి.. భాయి నినాదం స్వాతంత్ర్యం నాటి నుంచి ఉందన్నారు. సోదర భావంతో కలిసి మెలిసి పండుగలను జరుపుకోవాలని లక్ష్మారెడ్డి కోరారు.
ఈనెల 17న జల్ పల్లి, పహాడీషరీఫ్, షహీన్ నగర్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు కిచ్చెన్నగారు ప్రకటించారు.
అందరం సమానం… కులం, మతం వ్యక్తిగతమని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహరెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *