బయ్యారం,తెలంగాణ కానుక,ఫిబ్రవరి 26.
బయ్యారం మండలం ఇర్సులాపురం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ట్రైబుల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దేశీరామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో అందిస్తున్న మెనూ, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ,సైన్స్ ల్యాబ్‌లను పరిశీలించారు.
అదేవిధంగా పదో తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న 60 డేస్ యాక్షన్ ప్లాన్ పై విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు.తనిఖీ సందర్బంగా ట్రైబుల్ వెల్ఫేర్ డిడి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డాక్టర్ బి.శోభన్ బాబు,డిప్యూటీ వార్డెన్ లాలయ్య, హీరా సింగ్,శ్రీను,తులసీ దాస్,రవి తదితరులు పాల్గొన్నారు.
