రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని టోలి చౌక్ లో సాప్ కిడ్నీ ఎక్సటెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి లోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నవారితో ఆత్మీయంగా పలకరించారు. ఆధునికంగా ఏర్పాటు చేసిన కిడ్నీ సెంటర్ నిర్వాహకులను మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు.
ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఉచితంగా వైద్య సేవల అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రం లో ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్లను ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం విద్య,వైద్య రంగాలను ఎంతో ప్రోత్సహిస్తుందన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
ఈ కార్యక్రమంలో సాప్ ఆసుపత్రి చైర్మన్ నియాజ్ ఖాన్, ప్రముఖ నెప్రాలజిస్ట్ డా.షోయబ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
