ఇంటర్మీడియట్ ,పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ఆపరేషన్స్ పై సచివాలయంలో ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ,మార్చ్ 14 వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు ఉండడంతో పరీక్షల సమయం ఉదయం ,మధ్యాహ్నం సమయంలో అదనంగా బస్సులు ఉంచేలా చర్యలు తీసుకున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ఎండి నాగిరెడ్డి ఇతర ఆర్టీసీ అధికారులతో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల సమీపిస్తుండడంతో విద్యార్థులకు బస్సులు ఇబ్బందులు లేకుండా కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్షించుకోవడం జరిగిందనీ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.. గ్రామీణ ప్రాంతాల నుండి పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు బస్సులు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. బస్సుల ఆపరేషన్ మరింత కిందిస్థాయి వరకు పంపించడం జరిగిందన్నారు. పరీక్షా సమయంలో బస్సుల హాల్డు స్టాప్ ఉన్నా లేకున్నా బస్సులు ఆగేలా హాల్ టికెట్ ఆధారంగా పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులను దింపేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.. దీనిని ప్రతి డిపో మేనేజర్ ద్వారా ఆర్టీసీ కండక్టర్ , డ్రైవర్లకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకుని ఇలాంటి మానసిక ఆందోళన చెందకుండా పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని రవాణా శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.. హాల్ టికెట్ ద్వారా విద్యార్థులకు కావాల్సిన స్టాప్ దగ్గర దిగడానికి ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
సమీక్షా సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆర్టీసీ ఈడి లు ఇతర అధికారులు..
