ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న “అగ్రిబిజ్ కాంపిటిషన్–2026” కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. “కల్టివేటింగ్ ఐడియాస్ … హార్వెస్టింగ్ ఫ్యూచర్స్ ” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ పోటీలు యువతలో వ్యవసాయ రంగంపై సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ పోటీల్లో అగ్రిబిజినెస్ ఆవిష్కరణలు, అగ్రి-టెక్ & ఏ ఐ పరిష్కారాలు, వాతావరణ మార్పులకు అనుగుణమైన స్థిరమైన వ్యవసాయం, అగ్రి-ఎంటర్‌ప్రెన్యూర్షిప్ వంటి విభాగాలలో విద్యార్థులు తమ ప్రాజెక్టులు ప్రదర్శిస్తున్నారు.
అదనంగా వ్యవసాయంపై కవితా పోటీలు (పోయెట్రీ కాంపిటీషన్ ) మరియు కేస్ స్టడీ ప్రజెంటేషన్ పోటీలు (కేసు స్టడీస్ కాంపిటీషన్ ) కూడా నిర్వహించబడుతున్నాయి. కవితా పోటీలలో విద్యార్థులు రైతు జీవితం, సుస్థిర వ్యవసాయం వంటి అంశాలపై తమ భావాలను వ్యక్తపరుస్తుండగా, కేస్ స్టడీ పోటీలలో వాస్తవ వ్యవసాయ సమస్యలకు వినూత్న పరిష్కారాలను సూచిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు Dr.ఎం .గోవర్ధన్ సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు మరియు ప్రోత్సాహకాలు అందజేయబడనున్నాయి.
ఈ కార్యక్రమం యువతలో వ్యవసాయ రంగంపై చైతన్యం పెంపొందించి, భవిష్యత్తులో సృజనాత్మక ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.
రాజేంద్రనగర్ లో అగ్రి బిజ్ కాంపిటీషన్ 2026.
