రైతు కమిషన్ కార్యాలయం.

Spread the love

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విత్తనోత్పత్తి క్షేత్రాలపై రైతు కమిషన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాలో 8 చోట్ల సీడ్ ఫార్మ్ వున్నాయని, 1629 ఎకరాల్లో వున్న సీడ్ ఫార్మ్ లో వివిధ రకాల విత్తనాలను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి చేస్తున్నట్లు అధికారులు కమిషన్కు వివరించారు. ప్రధానంగా వరి, పెసర, జనుము, కందులు విత్తనోత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఐతే నకిలీ విత్తనాలను అరికట్టాలంటే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని మేలైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సూచించారు. అంతేకాదు విత్తనోత్పత్తి ని పెంచాలని దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక విత్తనోత్పత్తి క్షేత్రాల భూములు అన్యాక్రాంతం కాకుండా హద్దులను ఏర్పాటు చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ చేయాలనీ కోరారు. ఎక్కడైనా భూ సమస్యలు వున్న చోట.. ఆ విషయాలను అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తేవాలని సూచించారు. వ్యవసాయ శాఖకు చెందిన భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి , సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్ తోపాటు వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ నర్సింగరావు, జాయింట్ డైరెక్టర్ సుచరిత, డీడీఏ నాగమల్లీశ్వరీ, ఏడీఏ ఉషారాణి, సీడ్ ఫార్మ్ కు చెందిన అగ్రికల్చర్ అధికారులు వైద్యనాధ్, సక్రియ నాయక్, ఇంద్రసేన్, అనిల్ కుమార్, వాసు తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *