మున్సిపల్ ఎన్నికలు – పాలమూరు యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల భద్రత పరిశీలనజిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్.

Spread the love

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూర్ మునిసిపాలిటీ మరియు దేవరకద్ర మునిసిపాలిటీల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఎన్నికల అనంతరం బ్యాలెట్ పత్రాల నిల్వ మరియు ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్‌లు మరియు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు అక్కడి భద్రతా ఏర్పాట్లు, బారికెటింగ్, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ముఖ్య సూచనలు:
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత తప్పనిసరిగా అమలు చేయాలని.
స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ హాల్స్ పరిసరాల్లో సీసీ కెమెరాల ద్వారా 24 గంటల నిఘా ఏర్పాటు చేయాలని.
అనధికార వ్యక్తులకు అవకాశం లేకుండా కఠినమైన ప్రవేశ నియంత్రణ వ్యవస్థ అమలు చేయాలని.
కౌంటింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారులు వేర్వేరు మార్గాల ద్వారా ప్రవేశించేలా స్పష్టమైన మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని.
జనసంచారం అధికంగా ఉండకుండా పార్కింగ్ ప్రాంతాలను ముందే కేటాయించి ట్రాఫిక్ సజావుగా నడిచేలా ప్రణాళిక రూపొందించాలని.
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అందుబాటులో ఉంచాలని.
కౌంటింగ్ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర పోలీస్ పహారా కొనసాగించాలని.
ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకతతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి కావడం పోలీస్ శాఖ యొక్క ముఖ్య లక్ష్యమని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ డి.ఎస్.పి గిరిబాబు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, సీసీస్ ఇన్స్పెక్టర్ మోతీ రామ్, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ ఇచ్చిన ముఖ్య సూచనలు:
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత తప్పనిసరిగా అమలు చేయాలని.
స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ హాల్స్ పరిసరాల్లో సీసీ కెమెరాల ద్వారా 24 గంటల నిఘా ఏర్పాటు చేయాలని.
అనధికార వ్యక్తులకు అవకాశం లేకుండా కఠినమైన ప్రవేశ నియంత్రణ వ్యవస్థ అమలు చేయాలని.
కౌంటింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారులు వేర్వేరు మార్గాల ద్వారా ప్రవేశించేలా స్పష్టమైన మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని.
జనసంచారం అధికంగా ఉండకుండా పార్కింగ్ ప్రాంతాలను ముందే కేటాయించి ట్రాఫిక్ సజావుగా నడిచేలా ప్రణాళిక రూపొందించాలని.
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అందుబాటులో ఉంచాలని.
కౌంటింగ్ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర పోలీస్ పహారా కొనసాగించాలని.
ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకతతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి కావడం పోలీస్ శాఖ యొక్క ముఖ్య లక్ష్యమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ డి.ఎస్.పి గిరిబాబు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, సీసీ ఎస్ ఇన్స్పెక్టర్ మోతీ రామ్, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *