అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని శామీర్‌పేటలో ఉన్న హెచ్‌బీఎల్ ఇంజనీరింగ్ కంపెనీలో కార్మికులు చేపట్టిన జీతాల పెంపు ధర్నా విజయవంతంగా ముగిసింది. ఎమ్మెల్యేల జోక్యంతో కార్మికుల సమస్యకు సానుకూల పరిష్కారం లభించింది.
గత కొన్ని సంవత్సరాలుగా హెచ్‌బీఎల్ ఇంజనీరింగ్ కంపెనీలో సుమారు 1200 మంది కార్మికులు కాంట్రాక్ట్ లేబర్‌గా అతి తక్కువ జీతాలతో పనిచేస్తూ, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా జీవనం కొనసాగించడం కష్టంగా మారిన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో డైలీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు గత మూడు రోజులుగా కంపెనీ ఎదుట ఐక్యంగా ధర్నా చేపట్టారు.
కార్మికుల ఆవేదనను గుర్తించిన ఎమ్మెల్యేలు కార్మికుల తరఫున కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యేల చొరవతో హెచ్‌బీఎల్ ఇంజనీరింగ్ కంపెనీ మేనేజర్ శ్రీకాంత్ ద్వారా యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, ప్రస్తుతం కార్మికులకు అందిస్తున్న డైలీ నగదు వేతనంపై రూ.85-180 పెంపు చేయడానికి అంగీకారం సాధించారు.
ఈ నిర్ణయంతో కార్మికుల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయించినందుకు ఎమ్మెల్యేలకు కార్మికులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు
కార్మికుల పోరాటానికి విజయం…మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జోక్యంతో సమస్య పరిష్కారం.
