అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు జారె ఆదినారాయణ అధ్యక్షతన టిపిసిసి జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు
ఈ సందర్భంగా ముందుగా పట్టణంలోని పలు దేవాలయాలు చర్చిలలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు అశ్వారావుపేట అభివృద్ధి కోసం దైవ ఆశీస్సులు కోరారు
అనంతరం మున్సిపాలిటీ ప్రధాన వీధుల గుండా రోడ్ షో నిర్వహించి ప్రజలతో నేరుగా మమేకమయ్యారు ఈ సందర్భంగా ప్రజల నుండి విశేష స్పందన లభించింది అనంతరం రింగ్ రోడ్ సెంటర్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ప్రముఖులు ప్రసంగించారు
సిపిఎం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే అశ్వారావుపేట మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని రహదారులు తాగునీరు పారిశుద్ధ్యం పేదలకు ఇళ్ల నిర్మాణం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పనిచేసే నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా ప్రజలకు అందిస్తాం—- మంత్రి పొంగులేటి.
