కేంద్ర వార్షిక బడ్జెట్ 2026-27ను ఇవాళ పార్లమెంట్ లో ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, కేటాయింపులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనించనుంది.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పన్నుల రూపంలో తెలంగాణ కేంద్రానికి చెల్లిస్తున్న నిధులపై కాంగ్రెస్ నేత, మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సమీక్షించనున్నారు.
అందువల్ల బడ్జెట్ కేటాయింపుల పరిశీలనలో TPCC నేతలతో KLR పాల్గొంటారు. ఈరోజు ఆయన పాల్గొనాల్సిన కార్యక్రమాలను రద్దు చేయాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాము.*
ముఖ్యంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) రద్దు చేసి వీబీ జీరామ్ జీని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పథకానికి యథావిధిగా కొనసాగించాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉద్యమం కొనసాగిస్తుంది.
మధ్యతరగతి ఎదురు చూస్తున్న కేంద్రపద్దులో ఆదాయపన్ను, రైల్వేలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, RRR, విమానాశ్రయాలు, కొత్త ప్రాజెక్టులకు రాష్ట్రం నుంచి DPR లను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి పంపింది.
ఊరిస్తున్న కేంద్ర బడ్జెట్ ఏమాత్రం తెలంగాణకు న్యాయం చేస్తుందని… TPCC నేతలతో కలిసి లక్ష్మారెడ్డి పూర్తి బడ్జెట్ నివేదికను పరిశీలించనున్నారు.
కేంద్ర వార్షిక బడ్జెట్ 2026-27పై కాంగ్రెస్ సమీక్ష.
