సీసీ షరాఫ్ ఆస్పత్రిపై ఆరోపణలుచేయడం సరికాదు :

Spread the love

  • 50 ఏళ్లుగా పేద మధ్యతరగతి రోగులకు సేవలు
  • బంగారం చోరీ ఘటనపై ఖండించిన ఆస్పత్రి యాజమాన్యం

హైదరాబాద్ జనవరి 24: తెలంగాణ కానుక

కాచిగూడ సీసీ షరాఫ్ (టస్ట్) ఆస్పత్రి ఎలాంటి లాభపేక్ష లేకుండా గత 50 ఏండ్లుగా పేద, మధ్య తరగతి రోగులకు అది తక్కువ ధరల్లో సేవలందిస్తూ మన్నలను పొందుతుందని ఆ ఆస్పత్రి జీఎం పీఎస్ ఎన్ మూర్తి అన్నారు. ఇటీవల హాస్పత్రి లో బంగారం చోరీ ఘటనపై ఖండిస్తూ ఆస్పత్రి యాజమాన్యం విలే కరుల సమావేశం నిర్వహించారు. ఆస్ప త్రి జీఎం (మెడికల్) సోమారెడ్డి, జీఎం (ఫైనాన్స్) శేషాద్రితో పీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ రోగుల సౌకర్యర్థం కోసం సౌత్ ఇండియాలోనే సీసీషరాఫ్ (టస్ట్) ఆస్పత్రి ద్వారా రోగులకు మెరుగైన సేవ లు అందిస్తూ, వారి ఆరోగ్యలను కాపాడు తూ ముందుకు వెలుతున్నట్లు వారు పేర్కొన్నారు. అలాంటి ఆసుపత్రిపై కొంత మంది ఉద్దేశ పూర్వకంగా ఆస్పత్రిపై పనికట్టుకుని బురద జల్లుతున్నారని వారు ఆరోపించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *