పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన రూ.17 లక్షల విలువైన 64 మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా గుర్తించి, పేట్ బషీరాబాద్ పీఎస్ లో ఈరోజు వాటిని సంబంధిత యజమానులకు తిరిగి అందజేశారు.
ఈ సందర్భంగా మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి మాట్లాడుతూ..ఫిర్యాదుల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొబైల్ ఫోన్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్ పోయిన వారు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్‌లో తమ మొబైల్ వివరాలు నమోదు చేయాలని సూచించారు.
ఏసీపీ వెంట పేట్‌బషీరాబాద్ పీఎస్ ఎస్‌హెచ్‌వో కె. విజయ వర్ధన్, డీఐ డి. అజయ్ కుమార్, డీఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
