రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా కొత్తగూడెంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు చేరుకున్నప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు.ఎంపీ రవిచంద్ర తన జన్మదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం ఆ తర్వాత కొత్తగూడెం విచ్చేయగా పోస్టాఫీసు సెంటరులో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు,ఆయన కుమారుడు రాఘవ, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ తదితర ప్రముఖులు భారీ క్రేన్ సాయంతో గజమాల వేసి ఘన స్వాగతం పలికారు.ఆ తర్వాత ఊరేగింపుగా పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ చేరుకున్నారు.ఎంపీ రవిచంద్ర జన్మదినం సందర్భంగా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకటేశ్వర రావు,రాఘవ తదితరులు ఎంపీ రవిచంద్ర చేత భారీ కేక్ కట్ చేయించారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజును పార్టీ నాయకులు కనకేష్ పటేల్,రాజు గౌడ్,కాపు కృష్ణ,నవతన్,డిష్ నాయుడు,శాంతినాయక్,అన్వర్ పాషా,చందూనాయక్, గోవాడ గుణచరిత్ తదితరులు శాలువాలతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు
ఎంపీ వద్దిరాజుకు కొత్తగూడెంలో అపూర్వ స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు.
