శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Spread the love

వలసల జిల్లా పాలమూరు బిడ్డగా కరువు కష్టాలు, పేదరికం ఎలా ఉంటుందో నాకు పూర్తిగా తెలుసు

తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, ఇందుకు కాంగ్రెస్ కారణమని కెసీఆర్ విమర్శించారు

గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎలా ఉపయోగపడతాయో, ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై తన అనుభవంతో సూచనలు ఇస్తారని అనుకున్నాం

అందుకే కృష్ణా జలాలపై ఒకరోజు, గోదావరి జలాలపై ఒకరోజు సభలో చర్చిద్దామని ఆహ్వానించాం

ఈ శాసన సభకు ఒక పవిత్రత ఉంది.ఈ సభలో జరిగే చర్చలను, విషయాలను, అందులోని వాస్తవాలను ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో నమ్ముతారు.

ఎందుకంటే… ఇక్కడ అబద్దానికి ఆస్కారం లేదు. మాటల గారఢీలకు స్థానం లేదు.

ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలే తప్ప రాజకీయ ప్రయోజనాలకు ఇది వేదిక కాబోదు.

తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ప్రాతినిధ్యానికి ప్రతిరూపం ఈ సభ.

ఈ సభలో మాట్లాడే ప్రతిమాట రాష్ట్ర ప్రయోజనాలే పరమావదిగా ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో ఉంటుంది.

గడచిన రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు.

సభకు రండి అని నేను పదే పదే విజ్ఞప్తి చేశా.

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకునే ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రాలేదు

సభలోకి రాము, చర్చలో పాల్గొనం అని హరీష్ రావు మాట్లాడటం చట్టసభలను అవమానించడమే

మీరు సభ పెట్టండి మీ బట్టలు ఒడదీస్తామన్నారు

తోలు తీస్తామని కేసీఆర్ మాట్లాడారు

వారు సభలో చర్చలో పాల్గొని ఉంటే… ఎవరి బట్టలు ఎవరు ఊడదీస్తారు.. ఎవరి తోలు ఎవరు తీస్తారు అనేది తెలంగాణ ప్రజలకు తెలిసేది


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *