హైద్రాబాద్ సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన “అఖిల పక్ష పార్టీలు – సామాజిక ఉద్యమ సంఘాల” రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యా, ఉద్యోగాలు, చట్ట సభలలో మరియు కాంట్రాక్ట్ లలో 42% చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ ఎన్నికలను 42% బీసీ రిజర్వేషన్లతో మాత్రమే ప్రభుత్వం నిర్వహించాలి, లేకుంటే జేఏసీ నాయకులు ఇంటింటికి తిరిగి సర్పంచ్ ఎన్నికల్లో చేసిన మోసాన్ని వివరించి, మున్సిపల్ ఎన్నికలలో చేసే మోసాన్ని వివరించి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఒడగొట్టే విధంగా కార్యాచరణ చేసి పాలల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా, ఉన్న రిజర్వేషన్ల ను తగ్గించి 17% రిజర్వేషన్లు మాత్రమే బీసీలకు ఇవ్వడం జరిగింది.
కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు అనుకుంటే వెంటనే బీసీ రిజర్వేషన్లు ఇవ్వొచ్చు, కానీ బిజెపి పార్టీ తనకు పట్టనట్లు, సంబంధం లేదన్నట్లు ఉంటుంది, బీసీలను మోసం చేస్తున్నది కాంగ్రెస్, బిజెపి పార్టీలు.
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ లేదు, బీసీలకు ప్రత్యేక బడ్జెట్ లేదు,
బీసీ రిజర్వేషన్ల పై బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానానికి మద్దతు తెలపడం జరిగింది, అఖిల పక్ష భేటీలో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించక పోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు, పెండింగ్ లో ఉన్న ఫీజులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి.
ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ మధుసూదన చారీ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, మాజీ ఎంపీ హనుమంత్ రావు , బిసి జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ , బిసి జెఎసి నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్, గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, విక్రమ్ గౌడ్, శ్యామ్ కురుమ, గణేష్ చారీ , మణిమంజరి మరియు తదితరులు పాల్గొన్నారు.
