భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం గాంధీ భవన్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ—
ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం అనే విలువలతో 141 సంవత్సరాలుగా దేశానికి సేవలందిస్తున్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
