నార్సింగి డిప్యూటీ కమిషనర్‌ను కలిసిసర్ ఓటర్ల నమోదు ప్రక్రియపై చర్చించిన బిఆర్ఎస్ నాయకులు​,

Spread the love

నార్సింగి తెలంగాణ కానుక

నార్సింగి మున్సిపల్ పరిధిలో సాగుతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్ ), ఓటర్ల నమోదు ప్రక్రియపై బీ ఆర్ఎస్ నార్సింగి సర్కిల్ అధ్యక్షుడు కె. విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధి బృందం డిప్యూటీ కమిషనర్‌ను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
​ఈ సందర్భంగా బిఎల్ఒలు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి విధుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 50 శాతం మేరకే పనులు పూర్తయ్యాయని, ఇంకా అనేకమంది అర్హులైన పౌరుల ఓట్లు నమోదు కాకపోవడంపై విష్ణువర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
​ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు పలు కీలక అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు, సమాచారం కేవలం తెలుగులోనే ఉండటం వల్ల మైనారిటీలకు అవగాహన లోపిస్తోందని తెలిపారు. తెలుగు సరిగా రాని మైనారిటీల సౌకర్యార్థం సమాచారాన్ని ఉర్దూలోకి అనువదించి (ట్రాన్స్‌లేషన్) వివరాలు తెలియజేయాలని అధికారులను కోరారు.అద్దెదారుల (కిరాయిదారుల) ఓట్లు: మున్సిపల్ పరిధిలో నివసిస్తున్న వారిలో ఎక్కువ భాగం అద్దెదారులే ఉన్నారని అధికారులు తెలపడంతో, వారి ఓట్ల నమోదును ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారనే అంశంపై కమిషనర్‌తో చర్చించారు.
తప్పుడు ఓట్ల నివారణ: ఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా ముందుజాగ్రత్త చర్యగా ఎక్కడా తప్పుడు ఓట్లు నమోదు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
​ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు షేక్ ముక్తార్, ముఖ్య నాయకులు పెద్దపులి కిషన్, గణేష్ ముదిరాజ్, నరసింహ, మల్లేష్, గణేష్ రెడ్డి, చిరంజీవి, మహిపాల్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *