ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ప్రభుత్వ ఉద్యోగులకు,రిటైర్ ఉద్యోగులకు మద్దతుగా నిరహారఎంపీ డీకే అరుణ దీక్ష.

Spread the love

అధికారంలోకి రావడానికి అనేక మాయమాటలు చెప్పి ప్రజలను వంచించి,మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

అధికారంలోకి వచ్చిన వెంటనే DA లు, PRC లు ఎప్పటికప్పుడు ఇస్తామని హామీ ఇచ్చారు.

అన్ని రకాలుగా ఉద్యోగులకు ఫ్రెండ్లీగా ఉంటామని మాట చెప్పారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన ఇప్పటికి DA లు, PRC లు లేవు.

పదవి విరమణ చేసే నాటికి పెద్ద మొత్తంలో డబ్బు రావాలని, ఉద్యోగులు నెలనెల దాచుకున్న డబ్బు కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

ఉద్యోగులను ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తుందో.. అర్ధం అవుతుంది.

పదవి విరమణ పొందిన కుటుంబాలలో ప్రశాంతత లేకుండా చేసింది.

దాదాపు 70 మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూసి ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రశ్నిస్తాం.

బీజేపీ మీ అందరికి మద్దతుగా ఈ దీక్ష చేపట్టింది.

తెలంగాణ ప్రజలను ప్రభుత్వం మోసం చేసిన ప్రతి తీరు ఎండగడుతాం.

బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది.

ప్రశ్నించే వారిని,నిలదీసే వారిని అణిచివేసే విధంగా వ్యవహరిస్తున్నారు.

ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి.

ఈ ప్రభుత్వం ఉద్యోగులను నిండా మోసం చేసిందని అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

ఒక నియంతృత్వ పాలన పోయి మరో నియంతృత్వ పాలన వచ్చింది.

చిత్తశుద్ధి ఉంటే..వెంటనే ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను ఆదుకోవాలి.

వాళ్ళు క్లియర్ చేయాలనుకు బిల్లు క్లియర్ చేస్తున్నారు.

బ్రహ్మాండంగా పర్సంటేజ్ లు తీసుకొని బిల్లులు చెల్లిస్తున్నారు.

రిటైర్డ్ ఉద్యోగుల కు బెనిఫిట్స్ ఇస్తే.. పర్సంటేజ్ రాదు కాబట్టి ఇవ్వడం లేదు.

రిటైర్మెంట్ సమయానికి, ఉద్యోగులు దాచుకున్న డబ్బు వాళ్ళ కు ఇవ్వాలనే మనసు సీఎంకు, మంత్రులకు రావడం లేదు.

రాష్ట్రంలో విద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *