సీసీ షరాఫ్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్లో…

Spread the love

రూ.95 వేలకే మోకాలి కీలు మార్పిడి శస్త్ర చికిత్స

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వీనియోగం చేసుకోవాలని

హైదరాబాద్, ఫిబ్రవరి 24: పేద రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కాచిగూడలోని సీసీ షరాఫ్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ నిరంతరం కృషి చేస్తోందని ట్రస్టీ ఎన్.సుకుమార్, జనరల్ మేనేజ ర్లు ఏ. సోమారెడ్డి, కే.శేషాధ్రి, పి. ఎస్.ఎన్.మూర్తి తెలిపారు. మంగ ళవారం కాచిగూడలోని హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ డాక్టర్ శశిధరన్, డాక్టర్ జి. ప్రతాప్ రెడ్డి, డాక్టర్ గోవింద్ గాంధీ లతో కలిసి వారు మాట్లాడారు. హాస్పిటల్లో మోకాలి కీలు మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకునే పేద రోగులకు నందిని రమేష్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.50 వేలు సబ్సిడిగా అందిస్తున్నట్లు వా రు తెలిపారు. ఇతర కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.2లక్షల వరకు అయ్యే ఖర్చును సీసీ షరాఫ్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్లో మోకాలి కీలు మార్పిడి శస్త్ర చికిత్సకు రూ.1,45,000 వరకు ఖర్చు అవుతుందని, అందులో ట్రస్ట్ ద్వారా రూ.50వేలు చెల్లిస్తుండటంతో ప్రత్యేక ప్యాకేజీతో రూ. 95 వేలకే మోకాలికీలు మార్పిడి శస్త్ర చికిత్స పూర్తవుతుందని తెలిపారు. ఈ శస్త్ర చికిత్స ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించదని స్పష్టం చేశారు. అదేవిధంగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఆరోగ్య బీమా సదుపాయం ఉన్న వారు, సి.జీ.హెచ్.ఎస్ ఉద్యోగులు ఈ సదుపా యాన్ని వినియోగించుకోగలరని తెలిపా రు. అమెరికా టెక్నాల జీతో చేయబడిన ఇంప్లాంట్ ఉపయోగిస్తూ అనుభవజ్ఞు లైన ఆర్థోపె డిక్ వైద్యులచే శస్త్ర చికిత్సలు చే యడం జరుగుతుందన్నారు. చికి త్సా విధానంలో ఏలాంటి మార్పు ఉండదని, అన్ని కార్పొరేట్ ఆసు పత్రుల్లో అందుతున్న మాదిరిగానే ఇక్కడ వైద్య సేవలు అందుతాయ ని వారు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స అనంతరం రెండో రోజు నడిపించ డం జరుగుతుందని, మూడో రోజు డిస్ ఛార్జ్ చేస్తామని తెలిపారు. రెండు వారాల తరువాత పనులను యదావిధిగా చేసుకునే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వాట్సాప్ నెంబర్: 799 5273377 ద్వారా సంప్రదించ వచ్చునని వారు సూచించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *