మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు న్యాయం చేస్తాం ఎవరు ఆందోళన చందవద్దని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.మంగళవారం ఆయన నివాసం వద్ద సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లోని బఫర్ జోన్ నిర్మాణ అనుమతుల విషయంలో తలెత్తిన వివాదాలపై మొదటిసారి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సంబందిత అధికారులతో సంబంధిత అధికారులతో మాట్లాడారు.మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితుల భవిష్యత్తు వారి పెట్టుబడులకు పూర్తి రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు
బిల్డర్ చేసిన తప్పులకు అమాయకపు కొనుగోలుదారులు బలికాకూడదనేది ప్రభుత్వం ఉద్దేశమని అని తెలిపారు.
బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఫ్లాట్ల యజమానులకు ప్రభుత్వం తరపున రెండు రకాల ఆప్షన్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు
అదే విస్తీర్ణంలో వేరే సురక్షితమైన గెటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లను కేటాయించడం లేదా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం తగిన నష్టపరిహారం చెల్లించడం.
రాజకీయ ప్రలోభాలకు గురికావద్దు కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని వాటిని నమ్మి మోసపోవద్దు అని ఆయన మధు పార్క్ రిడ్జ్ మధు పార్క్ రిడ్జ్ వాసులను కోరారు.
బాధితులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం యంత్రాంగం నిరంతరం పని చేస్తుదన్నారు.
తన నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతోపాటు ప్రజలందరికీ ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నాను అన్నారు.
బిల్డర్లు నిబంధనలను అతిక్రమించి, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేసి, అందరిని ఇబ్బందుల్లోకి నెట్టడం దురదృష్టకరం ఒక బాధ్యతగల ఎమ్మెల్యేగా మీకు నేను అండగా ఉంటా మీరు ఒంటరి వారు కాదు
ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచిస్తోంది. మీ ఫ్లాట్లకు నష్టం వాటిల్లకుండా, సమానమైన విలువ కలిగిన వేరే ఫ్లాట్లను గెటెడ్ కమ్యూనిటీలో ఇప్పించడానికి లేదా మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
కొంతమంది మిమ్మల్ని భయపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. వారి మాటలు నమ్మి మీ ఆస్తులను తక్కువ ధరకు అమ్ముకోవద్దు. భవిష్యత్తులో ఈ వివాదాస్పద స్థలాలకు సరైన ధర రాకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ప్రతి పైసాకు, ప్రతి ఇటుకకు నేను జవాబుదారీగా ఉంటాను. మీకు న్యాయం జరిగే వరకు నేను మీ వెంటే ఉంటానని అభయమిస్తున్నాను అన్నారు.
హైదర్ గూడా 28.29 ఎకరాలలో ఉప్పర్ పల్లి లొని 3.10 ఎకరాలలో మొత్తం 10 నుండి 12 ఎకరాలలో బపెర్ జోన్ లో ఉంది నిర్మాణాలకు అనుమతి లేనపటికి ప్రబుత్వం వీరికి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. మొత్తం 44.08 ఎకరాలలో హిమాయత్ సాగర్ కట్ట నుండి 500 మీటర్ లోపు ఉన్నందున నిర్మాణాలకు అనుమతి లేనపటికి ప్రభుత్వం వీరికి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
