కుప్పం లో పీ4 బంగారు కుటుంబాలుమార్గదర్శులతో సీఎం సమావేశం.

Spread the love

కుప్పంలోని మూడు మండలాలను దత్తత తీసుకున్న మెఘా ఇంజనీరింగ్, అదానీ ఫౌండేషన్, టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి.

రామకుప్పం మండలంలో ప్రస్తుతానికి 100 కుటుంబాలకు జీవనోపాధి చూపించామని తెలిపిన మెఘా ఇంజనీరింగ్ ప్రతినిధి.

స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వారికి మెఘా ఇంజనీరింగ్ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపిన ఎంఈఐఎల్ ప్రతినిధి.

బంగారు కుటుంబాలకు ఆదాయం పెంచేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడి.

ప్రతి వంద కుటుంబాలకు ఓ బంగారు మిత్రను నియమించుకున్నామని తెలిపిన మెఘా ఇంజనీరింగ్ ప్రతినిధి.

ప్రస్తుతానికి 30 కుటుంబాలను గుర్తించి వారికి చేయూత ఇచ్చామని తెలిపిన టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి.

మరికొంత మంది బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకుంటామని తెలిపిన టీవీఎస్.

తమ ప్లాంట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని తెలిపిన టీవీఎస్ ప్రతినిధి.

పీ4 పథకం తెచ్చినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బంగారు కుటుంబాల ప్రతినిధులు.

తల్లిని వదిలి ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్లే అవసరం లేకుండా స్థానికంగా ఉపాధి పొందుతున్నామని వివరించిన ఓ లబ్దిదారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…

• బంగారు కుటుంబాలకు అహగాహన కల్పించేలా బంగారు మిత్రలను పెట్టుకోవడం మంచి పరిణామం.
• స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏ మేరకు వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయొచ్చో చూడండి.
• దశలవారీగా పేద కుటుంబాలను వృద్ధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరగాలి.
• ఆర్దికంగా ఆదుకోవటంతో పాటు అక్షరాస్యత పెంచేలా చూడాలి, ఉపాధి కల్పించాలి.
• ఉద్యాన, డైరీ, సెరీ కల్చర్ లాంటి వివిధ రకాల ఉపాధి మార్గాలను ఎంచుకోవాలి.
• భూమిలేని వారికి పశువుల పెంపకం లాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపండి.
• 500-700 కుటుంబాలను క్లస్టర్ గా మార్చి పర్యవేక్షణ చేస్తే మార్పు కనిపిస్తుంది.
• సమాజంలో అసమానతలను తగ్గించే ఉద్దేశ్యంతో పీ4 అమలు చేస్తున్నాం.
• ఆదాయ ఆర్జనకు వివిధ రకాల మోడళ్లను అమలు చేయటం ద్వారా పేదల సంపద పెంచొచ్చు.
• మల్టిపుల్ అప్రోచ్ విధానంలో బంగారు కుటుంబాలకు చేయూత ఇవ్వాలి.
• ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను కూడా ఇంటిగ్రేట్ చేసుకోండి.
• త్వరలోనే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నాం.
• రాష్ట్రంలో పేద, ధనికా తేడా లేకుండా 2.5 లక్షల వరకూ ఉచితంగా వైద్య సేవలు అందేలా ప్రణాళిక చేశాం.
• సంజీవని ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తాం.
• కుప్పంలో ఏర్పాటు కాబోయే పరిశ్రమలతో 40 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *