బీ జే పి పదాధికారుల సమావేశం.

Spread the love

‘భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర కమిటీల పనితీరుతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించి నాలుగు నెలల ఫలితాలను సమీక్షించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలని రాంచందర్ రావు గారు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా అనుబంధ విభాగాల పనితీరుపై కూడా రాంచందర్ రావు గారు సమీక్ష చేశారు. బిజెపి అగ్రనేతలతో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున ఐదు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సింగరేణి, నైనీ కోల్ టెండర్ల విషయంలో రాష్ట్రం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. సీబీఐ ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం నుండి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలని బీజేపీ డిమాండ్ అని చెప్పారు. గతంలో దావోస్ పర్యటనకు వెళ్లిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో, ఎంతమందికి ఉద్యోగాలు లభించాయో, అనే విషయాలు ప్రజలకు చూపించాలని సవాల్ విసిరారు. ఇప్పటికి రెండుసార్లు దావోస్ పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై వైట్ పేపర్ (శ్వేతపత్రం) విడుదల చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *