టీపీసీసీ పిలుపు మేరకు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర కమిటీలను భర్తీ చేస్తామని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి చెప్పారు.
మహేశ్వరం నియోజకవర్గంలో GHMC పరిధిలోని డివిజన్ కమిటీలు, మహేశ్వరం, కందుకూరు మండల నాయకులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కె ఎల్ ఆర్ సూచించారు.
కొన్ని డివిజన్లలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అన్ని అనుబంధ సంఘాలు సమావేశమై… కమిటీలు పూర్తి చేశాయని కిచ్చెన్నగారు చెప్పారు.
పూర్తి కానీ డివిజన్లు, మండల కమిటీల పేర్లను తుక్కుగూడ కేఎల్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో అందించాలని లక్ష్మారెడ్డి అన్నారు.
సామాజిక వర్గాల వారీగా… సీనియర్ల సూచనలు పాటించి పేర్లు ఇవ్వాలని తెలిపారు. అధిష్టానానికి పంపి అధ్యక్షులు సహా కమిటీ పేర్లను ప్రకటిస్తామన్నారు.
పార్టీ కమిటీలకు సిద్ధం కండి: కేఎల్ఆర్.
