మాజీ మంత్రి జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ వంశీ కృష్ణ.

Spread the love

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జగిత్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ జీవన్ రెడ్డి తో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, జీవన్ రెడ్డి ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడని, ఆయన చేసిన సేవలు అనేక తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయురారోగ్యాలతో శతాయుష్కులుగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *