అటల్ బిహారీ వాజ్‌పేయి గారి సేవలు దేశానికి చిరస్మరణీయం – శ్రీరాములు అందెల.

Spread the love

మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్‌పేట్ డివిజన్, నాదర్‌గుల్ గ్రామంలో మాజీ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్‌చార్జ్ అందెల శ్రీరాములు హాజరై, అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ, “అటల్ బిహారీ వాజ్‌పేయి గారు భారత రాజకీయాల్లో ఒక అపూర్వమైన నాయకుడు అని కవి హృదయంతో రాజకీయాల్లోకి వచ్చి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహానేత అని కొనియాడారు. అణు పరీక్షల ద్వారా భారతదేశానికి ప్రపంచస్థాయిలో గౌరవాన్ని తీసుకువచ్చిన ఘనత వాజ్పేయి గారిదేనని, సువర్ణ చతుర్భుజి రహదారి ప్రాజెక్ట్ ద్వారా దేశ మౌలిక వసతుల అభివృద్ధికి బాటలు వేసిన దూరదృష్టి కలిగిన ప్రధానిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. అలాగే “సర్వధర్మ సమభావం, సమన్వయ రాజకీయాలు, విలువలతో కూడిన పాలన వాజ్పేయి గారి ప్రత్యేకత” అని తెలిపారు. ప్రస్తుత తరం నాయకులు వాజ్‌పేయి ఆదర్శాలను అనుసరించి ప్రజాసేవలో ముందుకు సాగాలని, ఆయన చూపిన మార్గమే దేశానికి శ్రేయస్కరమని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు , కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *