కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అధికారుల సమన్వయంతో జిల్లాలో ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం పొందేందుకు,అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు నమోదు చేయడానికి ఈ కంట్రోల్ రూములను సంప్రదించవచ్చన్నారు.ఈ కంట్రోల్ రూములు 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండి,అందిన ఫిర్యాదులను రికార్డ్ చేసి వెంటనే చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.జిల్లా ప్రజలు మున్సిపల్ ఎన్నికలు–2026కు సంబంధించి ఫిర్యాదుల కోసం కింది టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదించాలని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.కంట్రోల్ రూమ్ నెంబర్లు:
ఆమన్ గల్ : 9032305567
చేవెళ్ళ : 9493321468
ఇబ్రహీంపట్నం : 9032123653
మొయినాబాద్ : 7661097839
షాద్‌నగర్ : 9182403236
శంకర్‌పల్లి : 7386755646
